తొలి ఏడాది పాలనపై ప్రజలకు ప్రధాని మోదీ ఆడియో సందేశం

Update: 2020-05-30 14:07 GMT

భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చే కలను సాకారం చేసే దిశగా తొలి ఏడాది పాలన సాగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన నేపథ్యంలో ప్రజలకు మోదీ ఆడియో సందేశమిచ్చారు. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ఆయన ప్రస్తావించారు. ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది కాలంలో ఎన్నో చరి త్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని మోదీ గుర్తు చేశారు. ఆర్టికల్-370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, రామజన్మభూమి వివాదానికి పరిష్కారం, అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం, వ్యవసాయా న్ని లాభసాటిగా మార్చడానికి చర్యలు తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు.

పేదలు, రైతులు, మహిళలు, యువత... ఇలా అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మోదీ చెప్పా రు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి ద్వారా ఒక్క సంవత్సర కాలంలోనే 72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తోందన్నారు. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంత రాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని, అడ్డంకులను అధిగమించడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నామని వివరించారు.

కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్, వలస కార్మికుల అవస్థలపైనా మోదీ స్పందించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు, కూలీలు, ఇతరులు విపరీతమైన బాధలు అనుభవించారని మోదీ పేర్కొన్నారు. ఈ సంక్షోభంలో ఎవ్వరీకి ఇబ్బందులు కలగలేదని తాము చెప్పడం లేదన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలాల కు చేరుకో వడానికి సైకిళ్లు, ట్రక్కులను ఆశ్రయించారని, కొంతమంది నడుచుకుంటూ వెళ్లారని మోదీ గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలో చిన్న తరహా పరిశ్రమలు, చేతివృత్తులవారు, హస్త కళాకా రులు, హ్యాకర్లు తీవ్ర బాధలు అనుభవించారన్నారు. ఐనప్పటికి ఈ బాధలు, ఇబ్బందులు, అసౌకర్యాలు విపత్తులుగా మారకుండా చూసుకుందామని, అంతా కలసి దేశాభివృద్ధికి కృషి చేద్దామని పిలుపు నిచ్చారు.

Similar News