తిరుపతిలోని కోటకొమ్మల వీధిలో పాత భవనం కూల్చివేతలో అపశృతి చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా భవనాన్ని కూలుస్తుండగా... ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదే సమయంలో పాల పాకెట్ తీసుకోవడానికి వచ్చిన భరత్ అనే బాలుడిపై శిథిలాలు పడడంతో.. అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రుయా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని కూల్చిన సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు.