వైట్‌హౌస్ సమీపంలో హింసాత్మక ఘటనలు.. భూగర్భ బంకర్‌లోకి డోనాల్డ్ ట్రంప్..

Update: 2020-06-01 15:25 GMT

అమెరికాలో జరుగుతున్న ఆందోళనలపై ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ అల్లర్లను దేశీయ టెర్రరిజంగా సంబోధించారు. ఈ హింసకు వామపక్షాలు, అరాచకవాదులే ఈ హింసకు కారకులంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మరోవైపు శుక్రవారం రాత్రి ఆందోళనలు హిసాత్మకంగా మారిన నేపథ్యంలో కొద్దిసేపు ట్రంప్‌ను వైట్‌హౌస్‌లోని భూగర్భ బంకర్‌లోకి తరలించారు. వాషింగ్టన్ లో ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి. వైట్‌హౌస్‌కు సమీపంలోని భవనాలను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. వారి దాడులలో కార్లు, చారిత్రక చర్చి ధ్వంసమయ్యాయి.

నల్ల జాతివారిపై పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని.. నిరసిస్తూ వ్యతిరేకంగా అమెరికాలో వరుసగా ఆరో రోజూ రాత్రివేళ నిరసనలు జరిగాయి. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసులు కొందరిని అరెస్టు చేస్తుండగా ఈ నిరసనలకు కారణమైంది. అల్లర్ల నేపథ్యంలో అమెరికా దేశవ్యాప్తంగా 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే, వీటిని లెక్క చేయకుండా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల ఈ నిరసనలు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.

న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలస్ తదితర నగరాల్లో పోలీసులతో నిరసనకారులు ఘర్షణలకు దిగారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ బుల్లెట్లు ప్రయోగించాల్సి వచ్చింది. కొన్ని చోట్లా అయితే పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పు కూడా పెట్టారు.అలాగే పలు దుకాణాలను లూఠీ చేశారు. ఇదిలావుంటే ఆందోళనలను నియంత్రించే క్రమంలో అమెరికా రిజర్వు సైనిక దళం నేషనల్ గార్డ్ తమ సిబ్బందిలో ఐదు వేల మందిని 15 రాష్ట్రాల్లో మోహరించినట్టు తెలిపింది.

Similar News