సూపర్ మార్కెట్‌లో లూటీలకు పాల్పడుతున్న ఆందోళనకారులు

Update: 2020-06-02 08:32 GMT

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‍ మృతికి నిరసనగా అమెరికాలో రాజుకున్న నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ను కూడా నిరసన సెగలు తాకాయి. దీంతో ప్రెసిడెంట్ ట్రంప్ కొంత సేపు బంకర్ లో దాక్కోవల్సి వచ్చింది. ఇదే అదనుగా కొంతమంది నిరసన కారులు కొన్ని చోట్ల సూపర్ మార్కెట్లల్లో లూటీలకు పాల్పడుతున్నారు. ఇతర ఖరీదైన దుకాణాల్లోకి చొరబడి దోచుకుంటున్నారు. దీంతో అమెరికాలో చెలరేగిన నిరసనలు ఎటు దారితీస్తాయో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కరోనా వైరస్‍ విజృంభణ సమయంలోనే ఆందోళనలు ఉవ్వెత్తున చెలరేగడంపై అందరూ ఆందోళన చెందుతున్నారు.

Similar News