ఈనెల 11న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సభ్యులు భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్ సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.