మధ్యప్రదేశ్ లో కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా

Update: 2020-06-02 19:59 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడింది. కొత్త మంత్రులు జూన్ 2న ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం బిజెపి ఎమ్మెల్యేలు లాబీయింగ్ మొదలుపెట్టారు. అయితే హఠాత్తుగా కేబినెట్ విస్తరణ వాయిదా పడింది. విస్తరణ తేదిని ఇంకా ప్రకటించలేదు.

కాగా ప్రతికూల పరిస్థితులలో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం పతనం తరువాత మార్చి 23 రాత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు మార్చి 24 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 29న, 5 మంది సభ్యులతో ఏప్రిల్ 21న మంత్రి మండలి ఏర్పాటైంది. మంత్రుల మండలిలో మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్ ఉన్నారు.

Similar News