ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై చైనా చేసిన పరిశోధనల్లో భారత్ గురించి భయంకర విషయాలు బయటపడుతున్నాయి. రానున్న కాలంలో భారత్ రోజుకు 15వేల కరోనా కేసులు నమోదవుతాయని తేలింది. గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకి 8వేల పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఇది మరింత పెరుగుతోందని.. జూన్ 15 నాటికి 15వేల కేసులు నమోదవుతాయని చైనా పరిశోదకులు తెలిపారు. చైనాలోని లాంగ్జో యూనివర్శిటీ పరిశోధకులు ఈ స్టాటిస్టికల్ మోడల్‌ను గత వారం విడుదల చేశారు. ఈ మోడల్ ప్రకారం జూన్ 2న భారత్ లో 9,291 కేసులు నమోదవుతాయని అన్నారు. అయితే వారి వారి అంచనాలకు దగ్గరగానే జూన్ 2న భారత్‌లో 8,909 కేసులు నమోవయ్యాయి. వారి పరిశోధనల్లో జనసాంద్రత, వాతావరణ పరిస్థితులను కొలమానంగా తీసుకొని అంచానా వేశారు. అయితే, భారత్ లో వాతావరణ పరిస్థితులు కరోనా వ్యాప్తికి అనుకూలంగా లేవని.. జనసాంద్రత కారణంగా ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని తేల్చారు. బుధవారం నుంచి రానున్న నాలుగు రోజుల్లో నమోదుకానున్న కేసుల సంఖ్య కూడా వారు తెలిపారు. 9676, 10078, 10498, 10936గా ఉంటుందని అక్కడి పరిశోధకులు అంచనా వేస్తున్నారు.