పదివేలు పెట్టినా.. ఇసుక దొరకడం లేదు: ఆలపాటి రాజా

Update: 2020-06-03 21:17 GMT

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజా. ఇసుక విధానం పేరుతో జగన్ సర్కార్ సామాన్యులకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. పదివేలు ఖర్చుచేసినా.. సామాన్యుడికి మాత్రం ఇసుక దొరకడం లేదన్నారు. మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో మద్యాన్ని పారిస్తున్నారని మండిపడ్డారు ఆలపాటి రాజా. కోటానుకోట్ల భూదందాలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు.

Similar News