ఏపీలో కరోనా కేసుల విజృంభణ కోనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో మొత్తం 9,986 శాంపిల్స్ ను పరీక్షించారు. దాంతో కొత్తగా మరో 98 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,377కి చేరింది.
అలాగే గత 24 గంటల్లో 29 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 2273 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1033 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకూ 71 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 98 కేసులలో నెల్లూరులో 19 మంది కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చారు