భారత్ లో మరోసారి పెరిగిన వైరస్ కేసులు.. ఇదే అతిపెద్ద వన్డే జంప్..

Update: 2020-06-04 12:57 GMT

భారత్ లో కరోనావైరస్ సంక్రమణ కారణంగా మరణించిన వారి సంఖ్య గురువారం ఉదయం 6,000 మార్కును దాటి 6,075 గా ఉంది. గురువారం కొత్తగా 260 మరణాలు సంభవించాయి. కరోనావైరస్ కేసులలో భారతదేశం గురువారం అతిపెద్ద వన్డే జంప్ అని చెప్పవచ్చు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 9,304 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులు కలిపి గురువారం మొత్తం కేసులు 2,16,919 కు చేరుకున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో మొత్తం 1,06,737 క్రియాశీల కేసులు ఉండగా, 1,04,107 మంది రోగులు కోలుకున్నారు.అత్యధికంగా ప్రభావితమైన మహారాష్ట్రలో ఇప్పటివరకు 74,860 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య గురువారం 2,587 కు పెరిగింది.

Similar News