ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.. బుధవారం అర్థరాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. సరిగ్గా రాత్రి 10 గంటల 42 నిమిషాలకు ఇది జరిగింది.. దాంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.. దీని తీవ్రతతో ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్ అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి.
నోయిడాకు ఆగ్నేయంగా 19 కిలోమీటర్ల దూరంలో 3.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపన నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్‌సిఎస్) తెలిపింది. ఎన్‌సిఎస్ ప్రకారం నాలుగు రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపననలు సంబవించినట్టయింది. అయితే ఈ భూప్రకంపనలతో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని ఎన్‌సిఎస్ నివేదించింది. కాగా భూకంప కేంద్రం గ్రేటర్ నోయిడాకు దగ్గరగా ఉండగా.. దాని అక్షాంశం , రేఖాంశం 28.4015 , 77.5185 గా ఉంది.