అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర తుఫాను గా మారిన విషయం తెలిసిందే. కాగా నిసర్గ తుపాను బుధవారం ముంబైలోని అలీబాగ్ వద్ద మధ్యాహ్నం 1గంట సమయంలో తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో నిసర్గ సంపూర్ణంగా తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తుఫాను దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం, బీఎంసీ సూచించాయి. ప్రజలు ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదో కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఏం చేయాలి?
*ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను వెంటనే లోపల పెట్టుకోవాలి.
*అవసరమైన పత్రాలు, నగలను ప్లాస్టిక్ సంచిలో ఉంచాలి.
*మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులతో సహా బ్యాటరీతో నడిచే పరికరాలను ఛార్జ్ చేసుకోవాలి.
*టీవీ, రేడియోలో ఇచ్చిన అధికారిక మార్గదర్శకాలపై శ్రద్ధ వహించాలి.
*కిటికీల నుండి దూరంగా ఉండాలి, కొన్ని కిటికీలను మూసివేసి, కొన్ని తెరిచి ఉంచాలి, తద్వారా గాలి పీడనం నియంత్రించబడుతుంది.
*విపత్తు సమయాల్లో టేబుల్స్ లేదా బల్లలు వంటి బలమైన ఫర్నిచర్ కింద మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
*ఆడిటోరియంలు , మాల్స్ వంటి పెద్ద టెర్రస్ వేదికల క్రింద ఆగవద్దు.
*శుభ్రమైన ప్రదేశంలో మంచినీళ్లను నిల్వ చేసుకోవాలి.
*ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి. వారికి ప్రాథమిక చికిత్స అందించండి.
*తల, మెడపై చేతులు అడ్డుపెట్టుకోవాలి.
*షాపింగ్ మాల్స్, ఆడిటోరియాలకు వెళ్లకూడదు.
*అవసరంలేని పరికరాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
ఏమి చేయకూడదు?
*పుకార్లను నమ్మవద్దు
*తుఫాను సమయంలో వాహనాన్ని నడపవద్దు.
*పురాతన భవనాల నుండి దూరంగా ఉండాలి.
*గాయపడిన వ్యక్తిని అత్యవరసమైతే తప్ప ఆస్పత్రికి తరలించకూడదు.
*నూనె లేదా మండే ఏదైనా పదార్థం ఎక్కడైనా పడితే వెంటనే దాన్ని శుభ్రం చేయాలి.
*మత్స్యకారులు సముద్రానికి వెళ్ళవద్దు.