ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

Update: 2020-06-04 10:05 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం తోపాటు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వాణిజ్య, రక్షణ రంగంలో ఇరుదేశాల సహకారంపై సంప్రదింపులు జరిపారు. ఈ "ద్వైపాక్షిక వర్చువల్ సమ్మిట్" లో ప్రధాని మోదీ ఈ విధంగా పేర్కొన్నారు.. భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం అలాగే సరైన అవకాశం అని తాను నమ్ముతున్నానని అన్నారు.

ఆస్ట్రేలియాతో సంబంధాలను మరింత వేగంగా విస్తరించడానికి భారత్ కట్టుబడి ఉందని మోదీ అన్నారు, వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాలకు మాత్రమే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మరియు ప్రపంచానికి కూడా ముఖ్యమైనదని.. ముఖ్యంగా COVID-19 సంక్షోభాన్ని అవకాశంగా చూడాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోదీ అన్నారు. "భారతదేశంలో, దాదాపు అన్ని రంగాలలో సమగ్ర సంస్కరణల ప్రక్రియ ప్రారంభించబడిందని ఇది త్వరలో గ్రౌండ్ లెవల్ లో ఫలితాలను చూపిస్తుందని అని ఆయన చెప్పారు. కాగా కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత భారత్‌లో పర్యటించాలని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ను మోదీ ఆహ్వానించారు.

Similar News