గాంధీ విగ్రహం ధ్వంసమవడంపై క్షమాపణలు కోరిన అమెరికా

Update: 2020-06-04 14:40 GMT

అమెరికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో... మన జాతిపిత గాంధీజీ విగ్రహం ధ్వంసమైంది. వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై అమెరికా క్షమాపణ చెప్పింది. తమ క్షమాపణల్ని అంగీకరించాలంటూ... అమెరికా రాయబారి కెన్ జస్టర్ విజ్ఞప్తి చేశారు. ఆఫ్రో అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాని.. గాంధీ విగ్రహ ధ్వంసాన్ని కూడా ఖండిస్తున్నట్టు... కెన్‌ జస్టర్‌ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

అటు.. అమెరికా వ్యాప్తంగా జాతివివక్షకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫ్లాయిడ్‌ చివరిసారిగా అన్న మాటలు... ఐ కాంట్ బ్రీత్‌ను నినాదాలు చేసుకుని... ఆందోళనలు చేపడుతున్నారు. అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. అయితే.. నిరసనకారులు వెనక్కి తగ్గకపోతే సైన్యాన్ని కూడా ప్రయోగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన.. మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే 40కిపైగా నగరాల్లో కర్ఫ్యూ విధించగా... 150 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు... 13 నగరాల్లో ఎమర్జెన్సీ విధించారు.

Similar News