హంద్రీనీవా ప్రాజెక్టుకు 'అనంత వెంకటరెడ్డి' పేరు

Update: 2020-06-05 16:14 GMT

హంద్రీనీవా ప్రాజెక్టును అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా పేరుగా మారుస్తూ ఏపీ‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఆయన పేరును తొలగించింది. దీంతో వెంకటరెడ్డి కుమారుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి.. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనంత వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News