ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 9,831 శాంపిల్స్ ను పరీక్షించగా 50 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3427 కు చేరింది. కొత్తగా 21 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 2294 మంది కోవిడ్ భారిన పడి కోలుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో కోవిడ్ కారణంగా ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 73కు చేరింది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1060గా ఉంది.