మాధవిపై సస్పెన్షన్ వేటు.. జగన్ వ్యాఖ్యలపై ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను షేర్ చేసినందుకు..

Update: 2020-06-05 15:02 GMT

గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ AGM మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. జగన్‌పై అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టినందుకు CID అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్‌తో కరోనా పోతుందన్న.. సీఎం జగన్ వ్యాఖ్యలపై ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను మాధవి ఇటీవల షేర్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందడంతో మాధవికి CID అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులను సీరియస్‌గా తీసుకుంటున్న CID ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. ఇటీవలే రంగనాయకమ్మ అనే మహిళతోపాటు మరికొందరికి నోటీసులు అందించారు. తాజాగా గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ AGM మాధవిపై కూడా కేసు నమోదైంది.

Similar News