ప్రధాని నరేంద్రమోదీ.. కేంద్రమంత్రి మండలిలో మార్పులు, చేర్పులు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఊహాగనాలు వినిపిస్తున్నాయి. పనితనం సరిగాలేని వారికి స్వస్తిపలికి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని భావిస్తున్నట్టు సమాచారం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా మార్చుతారని చర్చజరుగుతోంది. ప్రధానిమోదీ సన్నిహిత సహచరులతో కేంద్ర మంత్రుల పనితీరుపై చర్చ జరిగిందని.. దీంతో మంత్రివర్గంలో చేరికలు, తొలగింపులతోపాటు త్వరలోనే మంత్రిత్వ శాఖల్లో మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం నిర్మలాసీతారామన్ కి పదవీ గండం తప్పదని తెలుస్తుంది. ఆమెస్థానంలో బ్రిక్స్ కూటమికి బ్యాంక్ చైర్మన్ గా ఉన్న.. కేవీ కామత్ కేంద్రమంత్రివర్గంలో చేరుతారని అంటున్నారు. ఆయనతోపాటు మరికొందరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తుంది.