తూర్పుగోదావరిజిల్లా కాకినాడ అర్బన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నర్సింహావర్మ అనే కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొన్నాడు. వెంటనే అతన్ని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికిచేరుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.