విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది.. ఇప్పటికే డాక్టర్‌పై పోలసీల తీరుకు వ్యతిరేకంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది.. మరోవైపు సుధాకర్ తల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. తన కొడుకును అక్రమంగా కస్టడిలోకి తీసుకున్నారని.. ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. 24 గంటల్లో తన కొడుకును కోర్టులో ప్రవేశ పెట్టేలా చూడాలని ఆమె పిటిషన్‌లో కోరారు.
మరోవైపు డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. విశాఖ మానసిక వైద్యశాల సూపరిండెంట్ సమక్షంలో.. సుధాకర్ సంతకం పెట్టినట్టు పిటిషన్‌లో లేని కారణంగా.. టెక్నికల్ అబ్జెక్షన్ చూపుతూ... వెకేషన్ కోర్టు వాయిదా వేసింది. స్థానిక న్యాయవాది సమక్షంలో సంతకం పెట్టినట్టు.. ధృవీకరణ లేని కారణంగా వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.