ఉత్తరప్రదేశ్‌లోని జలాన్ జిల్లా మహిళా ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో జిల్లా యంత్రాంగం అపప్రమత్తమైంది.. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, ఆసుపత్రిలో చేరిన రోగులందరినీ వేరే ప్రదేశానికి తరలించడం తోపాటు, మొత్తం ఆసుపత్రిని శానిటైజ్ చెయ్యాలని ఆదేశించారు. శుభ్రపరచడం కోసం ఆ ఆసుపత్రికి రెండు రోజుల పాటు సీలు వేశారు. జిల్లాలో ఇప్పటివరకు 48 కరోనా కేసులు నమోదయ్యాయి, ఇందులో 41 మంది కోలుకోగా ముగ్గురు మరణించారు.
ప్రస్తుతం నాలుగు యాక్టీవ్ కేసులున్నాయి. వాస్తవానికి, బుధవారం 3 కరోనా కేసులు నమోదయ్యాయి, ఇందులో ముగ్గురు మహిళలే ఉన్నారు, ఒక మహిళ డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. ప్రసవానికి వచ్చిన మహిళ ఉపాధ్యాయుడైన తన సోదరుడితో సంప్రదించిన తర్వాత వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ లో మొత్తం 8,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 222 మంది కరోనా కాటుకు బలయ్యారు.