రాజస్థాన్ జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడి పట్ల స్థానిక పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో దాడికి పాల్పడ్డారు. కింద పడేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. కనీస మానవత్వాన్నే మరిచిపోయారు ఖాకీలు.
అంతే కాదు అతన్ని కింద పడేసిన పోలీసులు.. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తరహాలో అతని మెడపై మోకాలు పెట్టి తొక్కారు. వద్దని వేడుకుంటున్నా వినకుండా దాడికి పాల్పడ్డారే తప్పా.. వెనక్కి తగ్గలేదు. అమెరికాలో కాదు భారత్‌లో కూడా ఇది సాధ్యమే అని నిరూపించారు.
పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. మాస్క్ పెట్టుకోకపోతే దాడి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.