మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నీటి వినియోగం.. నివేదిక కోసం ఎదురు చూస్తున్న యంత్రాంగం
మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నీటి వినియోగంపై నీరి కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. రాతపూర్వకంగా వచ్చే నివేదిక కోసం జిల్లా యంత్రాంగం ఎదురు చూస్తోంది. ఒక వేళ రిజర్వాయర్‌లో నీరు తాగునీటికి పనికిరాదని చెబితే.. అందుకు తగిన దీర్ఘకాలిక ప్రణాళిక వేసే అవకాశం కనిపిస్తోంది. ఏడాది పాటు వేచి ఉండాలని చెబితే.. అందుకు తగినట్లు ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ట్రీట్‌మెంట్ చేస్తే సరిపోతుందని సూచిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొనున్నారు. రిపోర్ట్ మేరకు కార్యాచరణను సిద్ధం చేసే ఆలోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. నీటిలో కలుషితాల శుద్ధికి మెరుగైన పద్దతులపై దృష్టి సారించింది.