24 గంటల్లో దేశంలో పెరిగిన కేసుల సంఖ్య చూస్తే..

Update: 2020-06-05 13:48 GMT

గత 24 గంటల్లో దేశంలో దాదాపు 10,000 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదవడంతో భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు 226,770 కు పెరిగాయి. తాజాగా 9,851 కొత్త కరోనావైరస్ కేసులను భారత్ నివేదించింది. ఇది ఒక రోజులో నమోదైన అత్యధిక సింగిల్-డే స్పైక్ గా తెలుస్తోంది. కొత్తగా మహారాష్ట్రలో 2933, తమిళనాడు 1384, ఢిల్లీ 1359, గుజరాత్ 492, పశ్చిమ బెంగాల్‌లో 368, ఉత్తర ప్రదేశ్‌లో 367, హర్యానాలో 327, జమ్మూ కాశ్మీర్‌లో 285, కర్ణాటకలో 257, రాజస్థాన్‌లో 205, మధ్యప్రదేశ్‌లో 174, త్రిపురలో 176, ఆంధ్రప్రదేశ్ 141, బీహార్‌లో 126 ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, భారతదేశం 24 గంటల్లో 9,851 కొత్త కరోనావైరస్ కేసులు, 273 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 6,348 కు చేరుకుంది. 109,462 మందికి నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 110,960 క్రియాశీల కేసులు వున్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తన తాజా డేటాలో పేర్కొంది. గురువారం, భారతదేశంలో కొత్త కోవిడ్ -19 కేసులు మొదటిసారి 9,000 దాటింది.

Similar News