జగన్ పాలనపై మరో వైసీపీ నేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మావయ్య, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం కురుపాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రోడ్ల సదుపాయం, తాగునీటి కల్పన, అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే.. అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వట్లేదని ఆరోపించారు చంద్రశేఖర్ రాజు. అవకాశం ఉన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కులవృత్తి దారులను శాశ్వతంగా ఆదుకునేందుకు ఎలాంటి పరిష్కారం లేదని విమర్శించారు.