పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: ఆళ్లనాని

Update: 2020-06-04 18:56 GMT

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. రాష్ట్రంలో వైధ్యరంగాన్ని బలోపేతం చేయడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వవైధ్య కళాశాల కోసం ఆయన స్థల పరిశీలన చేశారు. స్థల పరిశీలనపై జిల్లా నేతలు, అధికారులతో మాట్లాడారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలు ఉన్నాయని.. ఇంకా 16 కళాశాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. దీని కోసం 16 వేల కోట్లు కేటయించామని.. ఆగస్టులో టెండర్లు పిలుస్తామని మంత్రి అన్నారు.

Similar News