సుప్రీంకోర్టులో ఏపీ తరపు అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా జీఎన్ రెడ్డి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగుల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున A.O.Rగా మహఫీజ్ నజ్కీని నియమించారు. ఇకపై అన్ని కేసుల్లోనూ ఆయనే AORగా కొనసాగుతారు.
ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో ఇప్పటికే 2 సార్లు వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీవీ ఛానెళ్ల నిషేధం కేసులోనూ TDSATలో ప్రభుత్వానికి మందలింపు తప్పలేదు. జరిమానా కూడా పడింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో అడ్వొకేట్ ఆన్ రికార్డ్‌గా జీఎన్ రెడ్డి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.