పీఐబీ చీఫ్ ‌కు కరోనా పాజిటివ్‌..

Update: 2020-06-08 14:10 GMT

ఢిల్లీలో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ ధత్వాలియా కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ధత్వాలియాను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కేంద్రంలో రాత్రి 7 గంటలకు చేర్చినట్లు తెలుస్తోంది.

ధత్వాలియాకు కరోనా సోకడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని మూసివేసి శానిటైజ్ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు మంగళవారం కూడా ఎన్‌ఎంసి మూసివేసే అవకాశం ఉందని, ప్రామాణిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా భారీ కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని వారు తెలిపారు. అయితే ధత్‌వాలియా ఈ మధ్య జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రకాష్‌ జవదేకర్‌లతో కలిసి సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.

Similar News