ఆంధ్రప్రదేశ్ : రెండు రోజులపాటు వర్షాలు

Update: 2020-06-08 10:51 GMT

ఎండవేడితో అల్లాడిపోతున్న జనానికి చల్లని కబురు వచ్చింది. ఆదివారం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గత వారం రోజులుగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని వచ్చిన రుతుపవనాలు రాయలసీమను పలకరించాయి. దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలు, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, వాయవ్య,

ఈశాన్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Similar News