అమరావతి ఉద్యమం @ 175 డేస్..

Update: 2020-06-09 10:45 GMT

అమరావతి ఉద్యమం 175 రోజులు దాటింది. లాక్‌డౌన్ వల్ల దాదాపు 80 రోజులుగా 29 గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమైనా.. అక్కడే తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని సడలింపులు ఇచ్చినందున భౌతికదూరం పాటిస్తూ ఉదయం, సాయంత్రం నిరసనలు తెలుపుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు 175 రోజులు దాటినా కూడా పోరాటంలో వెనక్కు తగ్గడం లేదు. ఆరు నెలలుగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతంగా కొనసాగిన, కొనసాగుతున్న సందర్భం బహుశా కొన్ని దశాబ్దాల్లో దేశంలో ఎక్కడా జరగలేదేమో.

Similar News