వరుసగా రెండో నెల్లోనూ బంగారం దిగుమతులు తగ్గాయి. కోవిడ్-19 సంక్షోభంతో కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో గోల్డ్‌కు డిమాండ్ భారీగా తగ్గింది. దీంతో మేలో బంగారం దిగుమతులు 99శాతం క్షీణించాయి.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ వినియోగదారుగా ఉన్న భారత్‌లో గత నెల్లో దిగుమతులు కేవలం 1.3 టన్నులుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో బంగారం దిగుమతులు 105.8 కోట్లుగా ఉంది. అలాగే ఏప్రిల్‌లో క్రూడా బంగారం దిగుమతి కేవలం 60 కిలోలుగా నమోదైంది. ఇది దశాబ్ద స్థాయి కనిష్ట స్థాయి కావడం విశేషం.
బంగారం దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో ఈ ఏడాది దిగుమతులు భారీగా తగ్గాయి. మొదటి 5 నెల్లలో దిగుమతులు కేవలం 75.46 టన్నులుగా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 80శాతం తక్కువగా ఉంది.