కర్నూలు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి సమయంలో అహోబిలం దగ్గర నల్లమల అడవీ ప్రాంత నుంచి బయటకు వచ్చిన చిరుతపులి కొద్దిసేసు రోడ్డుపై సేదతీరింది. దుర్గమ్మగుడి సమీపంలోని తెలుగు గంగ బ్రిడ్జివద్దకు చేరుకొని అక్కడే రోడ్డుపై పడుకుంది. రోడ్డుపై అడ్డంగా పడుకొని సేదతీరుతున్న చిరుతపులిని చూసి, ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. వాహనాల శబ్దం రావడంతో చిరుతపులి అక్కడినుంచి అడవిలోకి వెళ్లిపోయింది.
తెలుగు గంగ బ్రిడ్జివద్ద చిరుత కనిపించడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణీకులు ఒక్కసారిగా భయ బ్రాంతులకు గురయ్యారు. అది ఎక్కడ తమవైపుకు వస్తుందోనని ఆందోళన చెందారు. రాత్రిసమయంలో రోడ్డుపైనే ఉన్నారు. అయతే చివరకు వాహనాల శబ్దం రావడంతో అక్కడినుంచి అడవిలోకి వెళ్లిపోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.