పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

Update: 2020-06-09 11:09 GMT

కుక్కతోక వంకర పాకిస్థాన్ వక్రబుద్ధి రెండూ మారవు అన్నట్టు.. నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పదే పదే భారత దళాలను పాక్ రెచ్చగొడుతోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ దళాలు సోమవారం కాల్పులు జరిపాయి.. అయితే దీనికి భారత సైన్యం కూడా గట్టి రిటార్ట్ ఇచ్చింది. ఈ విషయాన్నీ రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపిందని.. పూంచ్ జిల్లాలోని ఖరీ కర్మారా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట మోర్టార్లతో తీవ్రమైన షెల్లింగ్ ద్వారా అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘనను ప్రారంభించింది" అని ఆయన చెప్పారు. దీనికి భారత సైన్యం తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుందని, ఇరుపక్షాల మధ్య సరిహద్దు షెల్లింగ్ జరుగుతోందని ఆయన అన్నారు.

Similar News