కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో హృదయ విదారకర ఘటన జరిగింది. పట్టణంలోని పోలీస్ లైన్ వీధిలో.. వీధి కుక్కలు దాడి చేసి ఐదేళ్ల చిన్నారి నరసింహను పొట్టనబెట్టుకున్నాయి. బాబు మృతితో.. తల్లి కన్నీరుమున్నీరవుతోంది. వీధి కుక్కలు దాడి జరిగినప్పటి దృశ్యాలు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కుక్కలు అత్యంత దారుణంగా బాలుడి వెంటబడి తరుముతూ దాడి చేయడంతో చూసేవారిని కంటతడిపెట్టిస్తోంది. శునకాలు వేగంగా వెంటాడినపుడు.. ప్రాణాలు దక్కించుకోవడానికి ఐదేళ్ల నర్సింహ తీవ్రంగా ప్రయత్నించి చివరికి నిస్సహాయస్థితిలో గాయపడి ప్రాణాలు విడిచాడు.