జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు హతమయ్యారు.. షోపియన్ జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. తెల్లవారుజామున 1.30 గంటలకు ఆర్మీ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)కు గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందింది..
ముగ్గురు ఉగ్రవాదులు సుగూ గ్రామంలోని ఇంటి లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దాంతో ఆపరేషన్ చేపట్టాయి.. ముందుగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ ప్రారంభించాయి. దాంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఆదివారం నుండి షోపియన్ జిల్లాలో ఇది మూడవ ఎన్‌కౌంటర్. ఇప్పటికే రెండు ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.