క్వారంటైన్ కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ.. ఆందోళనలో విశాఖ ప్రజలు

Update: 2020-06-10 15:17 GMT

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్వారంటైన్ అడ్డగా మారిపోయింది. కరోనా ప్రభావంతో రెండు నెలలుగా తెరుచుకోని ఈ విశ్వవిద్యాలయాన్ని ఇప్పుడు క్వారంటైన్ కేంద్రంగా మార్చేశారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నగరవాసులను ఇక్కడికే తరలిస్తున్నారు. నగరంలో చాలా చోట్ల కల్యాణ మండపాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని యూనివర్సిటీని క్వారంటైన్ కేంద్రంగా మార్చడంపై విద్యార్థి సంఘాలు, ప్రజలు మండిపడుతున్నారు. ఏయూ వర్సిటీ నగరం మధ్యలో ఉంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంభయంగా కాలం వెల్లదీస్తున్నారు. పొరపాటున చుట్టుపక్కల ప్రాంతాలకు కరోనా వ్యాపిస్తే పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏయూలోని హాస్టల్ భవనాలన్నింటినీ క్వారంటైన్ సెంటర్లుగా మార్చేసిన అధికారులు. అక్కడుంటున్న వారికీ సరైన సదుపాయాలు కల్పించడం లేదు..పశువుల మాదిరిగా ట్రీట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటి వరకు ఆరోగ్య పరీక్షలు చేయలేదని ఆరోపిస్తున్నారు. వారం రోజుల పాటు వందలాది మంది గదుల్లో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు..తక్షణమే పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News