జ్యోతిరాధిత్య సింధియాకు కరోనా పాజిటివ్

Update: 2020-06-09 18:59 GMT

ఇటీవల కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడా కరోనా బారిన పడ్డారు. వీరిద్దరనీ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. కాగా, ఇటీవలే బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్ప పొందారు. ఆయన కోలుకొని సోమవారం డిశ్చార్జ్ అయ్యారు.

Similar News