కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడప్పుడే పాఠశాల తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ వచ్చేసింది.. కొత్త విద్యాసంవత్సరం ఆరంభమయ్యే సమయమిది. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాయి. విద్యార్థుల సిలబస్, తరగతుల నిర్వహణ వంటి అంశాలపై కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందర్నీ సమీకరించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్ధనలను పరిగణ లోకి తీసుకోనుంది. ఇందుకోసం సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020 హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు తమ సూచనలు అందించాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఆగస్ట్ 15 తరవాత పాఠశాలలు ప్రారంభం కావచ్చని మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు.