కరోనా మహమ్మారి విజృంభణతో దాదాపు దేశంలోని హోటల్స్ అన్నీ మూతపడ్డాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం తొలిసారిగా కేరళ రాష్ట్రంలో రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకుంటూ హోటల్స్ తెరుచుకోవచ్చని సర్కారు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఇక్కడి హోటళ్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన వర్కర్లు మూడు లక్షల మంది పనిచేస్తున్నారు. వారంతా స్వరాష్ట్రాలకు వెళ్లి పోవడంతో వర్కర్ల కొరత ఏర్పడిందని కేరళ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూధన్ నాయర్ తెలిపారు. అందుకే చాలా హోటల్స్ లో పార్సిల్ సర్వీసులు మాత్రమే అందించగలుగుతున్నామని అన్నారు.