నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఎస్ఈసి( రాష్ట్రఎన్నికల కమిషనర్) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వారు దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.