దాదాపు 75 రోజుల అనంతరం శ్రీశైల మల్లికార్జుని ఆలయం తెరుచుకుంది. గంటకు 300 మంది భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు తప్పనసరిగా మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. ఆలయం ఆవరణంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఇక స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన సినీనటుడు రాం చరణ్ భార్య ఉపాసన స్థానిక చెంచులు, ఆలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలకు పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పోలీసులకు మాస్కులతో పాటు పీపీఈ కిట్లను అందించారు. వారు అందిస్తున్న సేవలను కొనియాడారు.