ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు (శుక్రవారం) విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రేపు మద్యాహ్నం 12.30 గంటల తర్వాత విడుదల చేస్తారని సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో పరీక్షా పేపర్లు కరెక్షన్ చేయడం ఆలస్యమైంది. సడలింపుల సమయంలో జవాబు పత్రాలు దిద్దడం పూర్తి చేసిన బోర్డు అధికారులు ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.