ఏపీలో 80కి చేరిన కరోనా మృతుల సంఖ్య

Update: 2020-06-11 14:11 GMT

ఏపీలో కరోనా కేసుల పెరుగుదల ఆగడం లేదు.. విజృంభణ ఆగడం లేదు.. బుధవారం నుంచి గురువారం 11 గంటల వరకూ మొత్తం 11,602 శాంపిల్స్ ను పరీక్షించగా. కొత్తగా మరో 135 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య తాజా బులిటెన్ ద్వారా వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4261కి చేరింది.

అలాగే గత 24 గంటల్లో 65మంది సంపూర్నంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2540 మంది కోలుకుని వివిధ జిల్లాల్లోని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 1641 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకూ 80 మంది మృతి చెందారు.

Similar News