విజయవాడ బెంజ్ సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రెండ్స్ బిల్డింగ్ పై అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటు.. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా పోలీసులు భావిస్తున్నారు.