ముంబైలో నకిలీ నోట్ల రాకెట్ గుట్టు రట్టు

Update: 2020-06-11 15:33 GMT

మహరాష్ట్రలోని పుణేలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. దీనిపై పూణే క్రైమ్ బ్రాంచ్ నకిలీ కరెన్సీ కేసులో పెద్ద పురోగతి సాధించింది. ఈ కేసులో భారత సైన్యంలో పనిచేస్తున్న సైనికుడితో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. భారతదేశం సహా అనేక దేశాల నుండి నకిలీ కరెన్సీ , తుపాకీని కూడా వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీలపై 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ముద్రించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రజలను మోసం చేయడమే వారి ఉద్దేశ్యం అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అయినప్పటికీ, ఇతర అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. క్రైమ్ బ్రాంచ్ కాకుండా, ఆర్మీ ఇంటెలిజెన్స్ బృందం కూడా ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది.

దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) బచ్చన్ సింగ్ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మిలటరీ ఇంటెలిజెన్స్ టీం నుంచి ఫేక్ కరెన్సీ గురించి మాకు సమాచారం అందిందని.. దాంతో సంయుక్త ఆపరేషన్ నిర్వహించి, నగరంలోని ఏవియేషన్ ప్రాంతానికి చెందిన 6 మందిని అరెస్టు చేశామన్నారు. వారినుంచి వెయ్యి రూపాయల నోట్లను మినహాయించి రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీ ఉన్నట్టు చేప్పారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారనీ అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించామని తెలిపారు.

Similar News