ఏపీ ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగినదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని సుప్రీం హెచ్చరించడం రాష్ట్ర ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకం చేసిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశాక ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని.. సోమిరెడ్డి విమర్శించారు.