నేడు ఏపీ కేబినెట్‌ భేటీ

Update: 2020-06-11 08:42 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇందుకోసం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, వైఎస్ఆర్ చేయూత తోపాటు పలు ముసాయిదా బిల్లు లపై చర్చించే అవకాశం ఉంది.. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, జీఎస్‌టీ ఎగవేతను నివారించడం, జీఎస్‌టీ చట్టంలో సవరణలు, గండికోట నిర్వాసితులకు పరిహారం వంటి అంశాలు చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.

Similar News