డాక్టర్ సుధాకర్ పదేపదే పోలీస్‌స్టేషన్‌కు రావడం వెనుక ఎదైనా దురుద్దేశం ఉండొచ్చని అన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని.. ఇప్పటికే కేసును సీబీఐ హ్యాండోవర్ చేసుకొని దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇలాంటి సమయంలో సుధాకర్ పదేపదే పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు సీపీ ఆర్కేమీనా. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే ఇప్పటికే రెండు సార్లు సుధాకర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పారు.