వక్ఫ్‌బోర్డు భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు

Update: 2020-06-11 08:21 GMT

అనంతపురం జిల్లా కదిరిలో వక్ఫ్‌బోర్డు భూమిపై కన్నేశారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి అండతో దౌర్జన్యంగా రోడ్డు వేసి ఆ భూమిని కబ్జాచేయాలని చూస్తున్నారంటూ..ఆందోళనకు దిగారు మైనార్టీ నేతలు. సర్వే నెంబర్‌ 400 a వక్ఫ్‌ బోర్డు భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ... వక్ఫ్‌భూముల రక్షణ సమితి నేతలు డిమాండ్‌ చేశారు. ఈ భూమిలో వైసీపీ ముఖ్యనేత ఒకరు చేపట్టిన రహదారి పనులను అడ్డుకున్నారు. వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ నిరసన చేపట్టారు. తక్షణమే వక్ఫ్‌భూమిని రక్షించకపోతే... ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు.

Similar News