దేశంలో 24 గంటల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు

Update: 2020-06-12 12:52 GMT

భారత్‌లో‌ కరోనాకేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తోపాటు వివిధ రాష్ట్రాలలో కొత్త కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 10,956 కేసులు నమోదు అయ్యాయి, అలాగే 396 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,97,535 కేసులు ఉన్నాయి.

ఇందులో 1,47,194 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,41,842 ఉన్నాయి. ఇక మొత్తం 8498 మంది కరోనా వ్యాధి భారిన పడి మరణించారు. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,50,305 గా ఉంది. ఇక దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 53,63,445కు చేరింది.

Similar News